దినఫలం

updated: March 16, 2018 21:48 IST

కాస్తంత బ్రహ్మ ముహూర్తం లో లేచి చదువుకోరా...వంటబడుతుంది అని మన పెద్దవాళ్లు అంటూండటం వింటూంటాం. అయితే ఈ బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారు ఝామున అని అర్దమేనా లేక వేరే అంతరార్దం ఏమైనా ఉందా... అప్పుడు నిద్ర లేచి చదివితే ప్రత్యేకంగా ఒరిగేదేమిటి..అలాగే ఆ ముహర్తానికి  అంత ప్రాధాన్యత ఏమిటి, బ్రహ్మ ముహూర్తం కు  బ్రాహ్మీ ముహూర్తం సంభందం ఏమిటో చూద్దాం.

బ్రహ్మ ముహూర్తం అన్నా  బ్రాహ్మీ ముహూర్తం అన్నా ఒకటే.  సాధారణంగా ఒక పనిని ప్రారంభించటానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగటానికి నిర్ణయించుకున్న ముహుర్తాన్ని మంచి ముహూర్తం అంటారు. 

సూర్యోదయాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయానికి రెండు ఘడియలు అంటే 48 నిముషాల ముందు కాలాన్ని అసురీ ముహూర్తం అని, అసురీ ముహూర్తానికి ముందు 48 నిముషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహుర్తం అంటారు. అంటే రాత్రి భాగంలోని ఆఖరి 48 నిమిషాల సమయం ను బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు బ్రహ్మి ముహూర్తం పూజలకు,జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు. 

ఇలా బ్రహ్మీ ముహుర్తానికి ఉన్న అత్యథిక ప్రాధాన్యత ఉండటంతో అనేకమంది నూతన గృహప్రవేశం సమయానికి ఈ ముహూర్తం పెడుతూంటారు.  అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది. మనం నివసించే గ్రామం లేదా సిటీ ని బట్టి సూర్యోదయం, సూర్యాస్తమయ వేళలు మారుతూంటాయి.

బ్రహ్మ ముహూర్తంలో ఏ పని అయినా ప్రారంభించవచ్చు. ఆ సమయంలో తిథి,వార, నక్షత్ర, దుర్మహూర్తములను పట్టించుకోవాల్సిన పనిలేదు. ఉదాహరణకు మన ఇంట్లోకి ఓ కొత్త వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి..దాన్ని  ఎప్పుడు మొదలెట్టవచ్చు అంటే బ్రహ్మీ  ముహూర్తంలో మొదలెట్టవచ్చు అన్నమాట

comments